ప్రగ్యా జైస్వాల్ నటించిన “అఖండ” పెద్ద హిట్. కానీ ఆ తర్వాత ఆమెకి తెలుగులో మరో సినిమా రావడానికి రెండేళ్లు పట్టింది. మళ్ళీ ఆమెకు బాలయ్యే అవకాశం ఇచ్చారు.
ప్రస్తుతం ఈ భామ బాలయ్య సరసన #NBK109 సినిమాలో నటిస్తోంది. ముగ్గురు హీరోయిన్లలో ఒకరు. ఇది తప్ప తెలుగులో మరో సినిమా లేదు. ఆమెకి ఇక్కడ క్రేజ్ కూడా లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐతే ఆమెకి రాక రాక ఒక బాలీవుడ్ మూవీ ఆఫర్ వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా ప్రచారంలో బిజీగా ఉంది.
అక్షయ్ కుమార్, తాప్సి, వాణి కపూర్, అమీ విర్క్, ఫర్దీన్ కపూర్ నటించిన “ఖేల్ ఖేల్ మే” అనే చిత్రంలో ప్రగ్య జైస్వాల్ ఒక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.
ఆరుగురు ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే కథ ఇది. ప్రగ్య ఆ స్నేహితుల బృందంలో ఒకరు. అంటే ఆమెకి ప్రాధాన్యమున్న పాత్రే.
సాధారణంగా అక్షయ్ కుమార్ వంటి పెద్ద హీరో సినిమాలో నటిస్తే ఎక్కువ క్రేజ్ వస్తుంది. హిట్ దక్కుతుందన్న నమ్మకం ఉంటుంది. కానీ అక్షయ్ కుమార్ కి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది. ఇటీవల దాదాపు డజను వరకు ఫ్లాప్స్ అందుకున్నాడు అక్షయ్. పైగా అతని సినిమాలకు కనీస ఓపెనింగ్స్ కూడా రావడం లేదు.
ALSO CHECK: Pragya Jaiswal at promotions in Pune
ఇలాంటి టైంలో ప్రగ్యకి అక్షయ్ సినిమాలో ఆఫర్ వచ్చింది. మరి ఈ సినిమాతో అయినా ఈ భామకి హిందీలో సక్సెస్ దక్కుతుందా? అక్షయ్ కుమార్ మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడా?