
మరికొన్ని రోజుల్లో తన పుట్టినరోజును (April 8) ఘనంగా జరుపుకోబోతున్నాడు అల్లు అర్జున్. ‘పుష్ప-2’ లాంటి పెద్ద హిట్ తర్వాత వస్తున్న పుట్టినరోజు కావడంతో, ఈసారి అతడిలో జోష్ రెట్టింపు ఉంది.
అతడి పుట్టినరోజు సందర్భంగా సినిమా ప్రకటనలు కూడా రాబోతున్నాయి. బన్నీ-అట్లీ సినిమాను ఎనౌన్స్ చేయబోతున్నారు. అదే విధంగా బన్నీ-త్రివిక్రమ్ సినిమాపై కూడా ప్రకటన వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మొన్నటివరకు ఈ సినిమా అప్ డేట్స్, ప్రకటల కోసం ఎదురుచూసింది అల్లు అర్జున్ ఆర్మీ. కానీ ఇప్పుడు ఆ సినిమాల కంటే ఎక్కువగా మరో అప్ డేట్ కోసం ఎదురుచూస్తోంది. అదే అల్లు అర్జున్ పేరు మార్పు.
తన పేరులో చిన్నచిన్న మార్పుచేర్పులు చేసే ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్. ఈ మేరకు ఇప్పటికే అతడు కొంతమంది న్యూమరాలజిస్టుల్ని సంప్రదించినట్టు చెబుతున్నారు చాలామంది. ప్రస్తుతం వినిపిస్తున్న పుకార్ల ప్రకారం, బన్నీ తన పేరుకు అదనంగా U, N అనే అక్షరాల్ని (Alluu Arjunn) జత చేస్తాడనే టాక్ వినిపిస్తోంది.
ALSO READ: Atlee to approach Priyanka Chopra for Allu Arjun’s film?
అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు దీనిపై కూడా ఓ క్లారిటీ రాబోతోంది.