అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ స్థాయి సినిమా చేస్తారని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. అవును.. బన్నీ-త్రివిక్రమ్ కలిసి వెయ్యి కోట్ల సినిమాపై కన్నేశారు. తాజాగా కాన్సెప్ట్ కూడా లాక్ చేశారు. బన్నీ సన్నిహితుడు బన్నీ వాస్ ఈ విషయాలు బయటపెట్టాడు.
“చాలా భారీ బడ్జెట్ సినిమా అది. ఆ సినిమాకు డబ్బులు తీసుకురావడానికి చినబాబు, అల్లు అరవింద్ కొత్త ఫైనాన్షియర్లు, కార్పొరేట్లను వెదుక్కోవాలి. అంత భారీ బడ్జెట్ సినిమా అది. బన్నీ, త్రివిక్రమ్ రెండేళ్ల నుంచి చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఓ కాన్సెప్ట్ కు ఫిక్స్ అయ్యారు. కథగా కాదు, కాన్సెప్ట్ మాత్రం రెడీ అయింది. దాని ప్రీ-ప్రొడక్షన్ కి, డబ్బులు సమకూర్చుకోవడానికి మాకు ఏడాదిన్నర టైమ్ పడుతుంది. అంత పెద్ద సినిమా అది.”
ఇలా అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాపై అంచనాలు పెంచేలా మాట్లాడాడు బన్నీ వాస్. బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలొచ్చాయి. ఈ 3 హిట్టయ్యాయి. అయితే అల వైకుంఠపురములో సినిమా ఇంకా పెద్ద హిట్టయింది.
ఈ సినిమా సక్సెస్ తర్వాత మరో సినిమా చేస్తే, నెక్స్ట్ లెవెల్ లో ఉండాలని అప్పుడే ఫిక్స్ అయ్యారు వీళ్లిద్దరూ. పైగా ఆర్గానిక్ గానే కథ పుట్టాలనే ఆలోచనతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ వచ్చారు. ఎట్టకేలకు కాన్సెప్ట్ లాక్ అయింది.