“ఫ్యామిలీ మేన్ 2″లో నటించింది సమంత. ఆమె అందులో నటించడానికి ప్రధాన కారణం రాజ్-డీకే. వీళ్ల చొరవ కారణంగానే తొలిసారి ఓటీటీలో అడుగుపెట్టింది సామ్. ఆ తర్వాత వాళ్లతోనే “సిటాడెల్” ఇండియన్ వెర్షన్ కూడా చేసింది. మళ్లీ ఇప్పుడు వాళ్లతోనే మరో ప్రాజెక్టు చేయడానికి రెడీ అవుతోందంట ఈ ముద్దుగుమ్మ.
“తుంబాడ్” లాంటి సస్పెన్స్-థ్రిల్లర్ తీసి అందర్నీ తనవైపు తిప్పుకున్న అనీల్ బార్వే దర్శకత్వంలో ఓ ఒరిజినల్ మూవీ చేయబోతోందట సమంత. ఈ ప్రాజెక్టుకు రాజ్-డీకే నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. నెట్ ఫ్లిక్స్ కోసం ఈ డీల్ సెట్ అయినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం సమంత చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి. ఓ మలయాళీ సినిమా ఆల్రెడీ మొదలైంది. ఇక స్వయంగా తనే నిర్మాతగా మారి ఓ సినిమా ప్రకటించింది సమంత. అయినప్పటికీ ఆమె ఇంకా ఏ సినిమా సెట్స్ పైకి ఆమె వెళ్ళలేదు. అంతలోనే ఈ ప్రచారం కూడా మొదలైంది.
ఐతే, ఈ సినిమా అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.