ఏదైనా ఫంక్షన్ లో మాట్లాడమంటే హీరోయిన్లు ఇంగ్లీష్ లో అదరగొట్టేస్తారు. స్థానిక భాషపై పట్టు లేక అలా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు. అయితే రష్మిక మాత్రం అలా కాదు. చక్కగా తెలుగులో మాట్లాడుతుంది. అంతేకాదు, కావాలనే ఇంగ్లీష్ లో మాట్లాడదు. ఇంగ్లీష్ పదాలు తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.
ఇదే విషయంపై ఓ నెటిజన్ రష్మికను ప్రశ్నించాడు. ఈవెంట్లలో ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడరని ప్రశ్నించాడు. దీనిపై రష్మిక స్పందించింది.
చాలామంది ప్రేక్షకులు తను వాళ్ల భాషలో మాట్లాడాలని కోరుకుంటారని, అందుకే భాష రాకపోయినా లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. తను ఇంగ్లిష్ లో మాట్లాడితే, వాళ్లను అగౌరవించినట్టు ఫీల్ అవుతానని, అందుకే కష్టపడి తెలుగు నేర్చుకొని మరీ మాట్లాడుతున్నానని తెలిపింది.
రీసెంట్ గా ” గమ్ గమ్ గణేశ” ఫంక్షన్ లో పాల్గొంది రష్మిక. అక్కడ పూర్తిగా తెలుగులో మాట్లాడింది. తెలుగు అర్థంకాని తమలాంటి ప్రేక్షకుల కోసం ఇంగ్లీష్ లో మాట్లాడాల్సిందిగా ఓ నెటిజన్ కోరాడు. దానిపై రష్మిక పై విధంగా స్పందించింది.