
ఆ మధ్య నటి పవిత్ర లోకేష్ తో ప్రేమాయణం, పెళ్లితో వార్తల్లో నిలిచారు సీనియర్ నటుడు నరేష్. కానీ ఇప్పుడు సినిమాలతోనే ప్రేక్షకులను ఎక్కువగా పలకరిస్తాను అంటున్నారు. తన కెరీర్లోనే 2025 అత్యంత బిజీయెస్ట్ ఏడాది కాబోతుంది అని చెప్తున్నారు.
“సంక్రాంతి వస్తున్నాం సినిమా విజయం నాకు కొత్త ఉత్సాహాన్నీ, ఆనందాన్ని ఇచ్చింది. అనిల్ రావిపూడి నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. ఈ సినిమా మూడు వందల కోట్లు దాటే అవకాశం ఉందని విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఇందులో నేను చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్ హైలెట్లలో ఒకటిగా నిలవడం మరింత ఆనందంగా వుంది. ఈ ఏడాది బిగ్ సక్సెస్ తో స్టార్ట్ అయ్యాను,” అని ఆనందంగా అన్నారు నరేష్.
“ప్రస్తుతం తొమ్మిది సినిమాల షూటింగ్ లు నడుస్తున్నాయి. అందులో రెండు ప్రధాన పాత్రలు కూడా ఉన్నాయి,” అని తెలిపారు నరేష్.
“శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా చేస్తున్న అలాగే నారా రోహిత్ తో ‘సుందరకాండ’, ఇంద్రగంటి గారి ‘సారంగపాణి జాతకం’, రవితేజ గారితో ‘మాస్ జాతర’ చేస్తున్నాను. మారుతి రైటింగ్స్ లో ‘బ్యూటీ’ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాను… ఇలా లిస్ట్ పెద్దగా ఉంది.”