
రామ్ చరణ్ పెంపుడు కుక్క పేరు రైమ్. ఇదంటే చరణ్ కు, ఉపాసనకు చాలా ఇష్టం. అది ఎంతిష్టమో మాటల్లో చెప్పలేం. చిన్న ఉదాహరణ చెప్పుకుందాం.
ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని పెట్టాలని నిర్వహకులు భావించారు. అది గొప్ప గౌరవం. టుస్సాడ్స్ లో విగ్రహం అంటే అదో ఘనత.
అలాంటి ఘనత తనకు దక్కడంపై రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే ఒక కండిషన్ పెట్టాడు. తనతో పాటు, తన కుక్క పిల్ల రైమ్ కు కూడా మైనపు విగ్రహంలో చోటు కల్పిస్తేనే అంగీకరిస్తానని, లేదంటే వెనక్కు వెళ్లిపోవచ్చని క్లియర్ గా చెప్పేశాడు.
దీనికి టుస్సాడ్స్ నిర్వహకులు అంగీకరించారు. రైమ్ ను అంగీకరించకపోతే, మైనపు విగ్రహానికి నో చెబుదామనుకున్నాడట చరణ్. రైమ్ కూడా ఉండేందుకు నిర్వహకులు ఒప్పుకోవడంతో తను మైనపు విగ్రహానికి అంగీకరించానని అన్నాడు.
రైమ్ అంటే రామ్ చరణ్ కు ఎంతిష్టమో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. క్లింకీర పుట్టకముందు రైమ్ పక్కన పడుకోవడానికి చరణ్-ఉపాసన గొడవ పడేవారంట.