కెరీర్ పరంగా ఎప్పుడూ డేరింగ్ అండ్ డాషింగ్ ఉంటాడు విజయ్ దేవరకొండ. ముక్కుసూటితనం, కథల ఎంపికలో ధైర్యమే అతడ్ని స్టార్ ను చేసింది. అయితే రీసెంట్ గా అతడు ఫ్లాపులు చూశాడు. దీంతో మరోసారి విజయ్ దేవరకొండ తన పాత పంథాలోకి మారాడు.
మనసుకు నచ్చిన కథలతోనే ముందుకెళ్లాలని నిర్ణయించుకున్న విజయ్ దేవరకొండ, రీసెంట్ గా 2 ప్రాజెక్టులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక సినిమాను రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. మరో సినిమా రవికిరణ్ కోలా దర్శకత్వంలో రాబోతోంది.
వీటిలో రాహుల్ సాంకృత్యాన్ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తొలిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో అతడు తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ పోషించబోతున్నాడట.
ఈ మేటర్ ఎంతవరకు నిజమనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే విజయ్ దేవరకొండ ప్రయోగాలకు ఎప్పుడూ ముందుంటాడు. కాబట్టి అతడు తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు రౌడీ బాయ్స్.