
విజయ్ దేవరకొండ ప్రస్తుతం “కింగ్ డం” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. మే 30న విడుదల కానుంది “కింగ్ డం.” మరోవైపు, విజయ్ దేవరకొండ మరో రెండు సినిమాలు కూడా మొదలుపెట్టనున్నాడు. అందులో ఒకటి దిల్ రాజు నిర్మించే చిత్రం.
దిల్ రాజ్ నిర్మించే చిత్రానికి ఇంకా పేరు అనౌన్స్ చెయ్యలేదు. ఐతే, దిల్ రాజు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థ నిర్మిస్తున్న కొత్త సినిమాల గురించి చెప్తూ విజయ్ తో “రౌడీ జనార్దన్” (Rowdy Janardhan) తీస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత తప్పు తెలుసుకున్నారు. ఆ టైటిల్ అధికారికంగా ఇంకా తాము ప్రకటించలేదు అని అర్థం చేసుకున్నారు.
అలా ఈ సినిమా టైటిల్ బయటికి వచ్చింది. విజయ్ దేవరకొండకి ‘రౌడీ స్టార్’ అనే పేరు ఉంది. ఆ పేరులోని రౌడీని తీసుకొని జనార్దన్ అని యాడ్ చేశారు. ఈ సినిమాకి రవి కోలా దర్శకుడు. ఇంతకుముందు ఈ దర్శకుడు “రాజావారు రాణిగారు” అనే సినిమా తీశాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.
అలాగే “శ్యామ్ సింగ రాయ్” దర్శకుడు విజయ్ దేవరకొండ హీరోగా రాయలసీమ నేపథ్యంగా ఒక పీరియడ్ మూవీ తీయనున్నాడు. అది త్వరలోనే మొదలు అవుతుంది.