గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఇవ్వలేదు ఇప్పటివరకు. ఇప్పుడే తొందరలేదు అన్నట్లుగా నిర్మాణ సంస్థ సైలెంట్ గా ఉంది ఇప్పటివరకు. కానీ సడెన్ గా ఈ రోజు ఒక అప్డేట్ వచ్చింది.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి ప్రకటన వచ్చింది. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు నుంచి త్వరలోనే విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామనేది ఆ ప్రకటన సారాంశం. ఉన్నఫలంగా ఇప్పటికిప్పుడు ఈ ప్రకటన రావడం వెనక ఓ పెద్ద కారణం ఉంది.
ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్ నడుస్తోంది. ఆ షెడ్యూల్ నుంచి విజయ్ దేవరకొండ లుక్ లీక్ అయింది. ఒకటి కాదు, ఏకంగా స్టిల్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో చేసేదేం లేక మేకర్స్ ఇలా ప్రకటన చేయాల్సి వచ్చింది. ఈ గ్యాప్ లో లీక్ అయిన స్టిల్స్ ను వైరల్ చేయొద్దని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు వీళ్లు. అయితే ఇప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. లీక్ అయిన పిక్స్ తో వాల్ పేపర్లు కూడా తయారుచేసుకున్నారు ఫ్యాన్స్. రేపోమాపో ఫ్లెక్సీలు వెలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ సినిమా ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ రిలీజ్ కావొచ్చు.