బాలీవుడ్ లో ఒకప్పుడు రణబీర్ కపూర్ కు క్యాసనోవా అనే పేరు ఉండేది. మినిమం గ్యాప్స్ లో లవర్స్ ను మారుస్తూ, చాలా మంది హీరోయిన్లతో అతడు డేటింగ్ చేశాడు. కాఫీ విద్ కరణ్ కార్యక్రమంలో కొంతమంది హీరోయిన్లు అతడిపై జోకులు కూడా వేశారు. రణబీర్ కపూర్ కాండోమ్ యాడ్ కు సరిగ్గా సరిపోతాడంటూ జోకులేశారు.
తాజాగా రణబీర్ తన గత జీవితంపై స్పందించాడు. తనను చాలామంది క్యాసనోవా అన్నారని, మరికొంతమంది తనను ఛీటర్ అని కూడా పిలిచారని అంగీకరించాడు. ఓ టాక్ షోలో పాల్గొన్న రణబీర్, ఉన్నదున్నట్టు మాట్లాడాడు.
తను గతంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్లతో డేటింగ్ చేసిన మాట వాస్తవం అన్నాడు. అయితే వాళ్ల పేర్లు మాత్రం అతడు వెల్లడించలేదు. ఈ క్రమంలో చాలామంది తనను స్త్రీలోలుడు (ఉమెనైజర్) అన్నారని, మరికొంతమంది తనను ఛీటర్ అని అన్నారని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ కొంతమంది తనను మోసగాడిగానే చూస్తున్నారని ఆయన పెద్ద బాంబ్ పేల్చాడు.
గతంలో దీపిక పదుకోన్, కత్రినాకైఫ్ తో డేటింగ్ చేశాడు రణబీర్. ఇద్దరితో అతడికి బ్రేకప్ అయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు దీపిక-రణ్వీర్ పెళ్లి చేసుకున్నారు. కత్రినా-విక్కీ కౌశల్ పెళ్లి చేసుకున్నారు.
అదే టైమ్ లో అలియాభట్ తో డేటింగ్ చేసిన రణబీర్ కపూర్, ఫైనల్ గా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీళ్లంతా తమతమ జీవితాల్లో సెటిలైనప్పటికీ.. రణబీర్ కు మాత్రం మోసగాడు అనే ట్యాగ్ లైన్ అలానే ఉండిపోయింది. ఇదే విషయాన్ని అతడు అంగీకరించాడు.