ఇటీవలే పెళ్లి చేసుకొంది వరలక్ష్మి శరత్ కుమార్. థాయిలాండ్ లోని ఒక రిసార్ట్ లో ఘనంగా జరిగింది ఆమె వివాహం. పెళ్ళికి ముందే చెన్నైలో సెలెబ్రెటీలకు వెడ్డింగ్ రిసెప్సన్ ఏర్పాటు చేసింది.
పెళ్లి తర్వాత హైదరాబాద్ విచ్చేసి మీడియాకి పెళ్లి విందు ఏర్పాటు చేసింది. భర్త నికోలై సచ్‌దేవ్ తో కలసి హైదరాబాద్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు వరలక్ష్మి శరత్‌కుమార్.
“హైదరాబాద్ నాకు రెండో ఇల్లు. మీరంతా నాకు చాలా సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్ ఇలానే వుండాలి,” అని మీడియాతో అన్నారు వరలక్ష్మి శరత్‌కుమార్. ” నా హస్బెండ్ తో కలిసి ఫస్ట్ టైం మీతో మీట్ కావడం చాలా ఆనందంగా వుంది.సినిమాలు చెయ్యడం మానెయ్యను ఇంకా చాలా సినిమాలు చేస్తాను,” అని క్లారిటీ ఇచ్చారు.
“నా భార్య అద్భుతమైన నటి. అంతకన్నా మంచి మనిషి. తనని మ్యారేజ్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. మీరంతా తనని ఎంతగానో సపోర్ట్ చేశారు. ఒక ఫ్యామిలీ లా చూసుకున్నారు. మీ సపోర్ట్ ఇలానే వుండాలి,” అన్నారు ఆమె భర్త నికోల్.