డబుల్ ఇస్మార్ట్ నుంచి మరో సాంగ్ వచ్చింది. సినిమా నుంచి ఇది రెండో పాట. మొదటి సాంగ్ టైపులోనే ఇది కూడా పూరి జగన్నాధ్, మణిశర్మ స్టయిల్ లోనే సాగింది. అయితే ఓ చిన్న కొత్తదనం మాత్రం యాడ్ అయింది.
మార్ ముంత ఛోడ్ చింత అనే లిరిక్స్ తో సాగే ఈ పార్టీ సాంగ్ లో మధ్యమధ్యలో తెలంగాణ మాజీ ముఖ్యంత్రి కేసీఆర్ వాయిస్ కూడా వినిపించింది. ‘ఏం జేద్దామంటావ్ మరి’ అనేది కేసీఆర్ ఫేమస్ డైలాగ్. ఆ వాక్యాన్ని ఈ పాటలో అక్కడక్కడ వాడారు. ఈ పంచ్ లైన్ పాటకు కిక్కు తీసుకొచ్చింది.
కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను రాహుల్ సింప్లిగంజ్ పాడాడు. పాట ఫుల్ ఎనర్జీతో ఉంది. హీరో రామ్ అంతే ఎనర్జీతో డాన్స్ చేయగా.. హీరోయిన్ కావ్య థాపర్ తన అందాలతో పాటను మరింత కలర్ ఫుల్ గా మార్చేసింది.
ఆగస్ట్ 15న థియేటర్లలోకి వస్తోంది డబుల్ ఇస్మార్ట్.