
ఆమె ఇప్పటికే ‘బేబి’ సినిమాలో బోల్డ్ గా నటించింది. రిలీజ్ కు రెడీ అయిన ‘జాక్’ లో కూడా హీరోకు లిప్ కిస్ ఇచ్చి కాస్త బోల్డ్ గానే కనిపించింది. అయితే ఈసారి అంతకుమించి అన్నట్టు కనిపించబోతోంది ఈ నటి.
త్వరలోనే మరో బోల్డ్ క్యారెక్టర్ లో వైష్ణవి చైతన్య కనిపించబోతోంది. ఇది ఎంత బోల్డ్ అంటే, తన పాత్రలో ఆమె విచ్చలవిడిగా బూతులు మాట్లాడబోతోంది. పచ్చి మోడ్రన్ బూతులన్నింటినీ అలవోకగా చెప్పబోతోంది.
సితార సంస్థ నిర్మిస్తోన్న ఒక సినిమాలో వైష్ణవి చైతన్య నటిస్తోంది.
ప్రస్తుతం జనబాహుళ్యంలో బాగా కలిసిపోయిన F**K లాంటి బూతులతో పాటు, మరెన్నో తెలుగు బూతుల్ని వైష్ణవితో వెండితెరపై చెప్పించబోతున్నారు. ఇన్నాళ్లూ హీరోలు మాత్రమే బూతులు మాట్లాడారు. ఇకపై హీరోయిన్లు కూడా తెరపై బూతులు మాట్లాడబోతున్నారు. ఆ సినిమాలో ఆమె ఇలా బూతులు మొదలుపెడుతుంది. వైష్ణవి చైతన్యతో ఆ ట్రెండ్ మొదలుకాబోతోందన్నమాట.