
చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లెక్కప్రకారం సంక్రాంతికి విడుదల కావాలి. కానీ ‘గేమ్ ఛేంజర్’ కోసం తన విడుదల తేదీని త్యాగం చేశారు చిరు.
అలా వాయిదాపడిన ‘విశ్వంభర’ సినిమాను జులై 24 లేదా ఆగస్ట్ 21న విడుదల చేసే అవకాశం ఉందని తెలుగుసినిమా.కామ్ ఇదివరకే వెల్లడించింది. ఇప్పుడదే నిజమైంది. జులై 24న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.
దీని వెనక ఓ సెంటిమెంట్ కూడా నడిచింది. గతంలో ఇదే తేదీకి ‘ఇంద్ర’ సినిమా వచ్చింది. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అందుకే సెంటిమెంట్ ప్రకారం, అదే తేదీకి ‘విశ్వంభర’ ను విడుదల చేయాలనుకుంటున్నారు.
ALSO READ: Lord Shri Ram’s link to Megastar’s ‘Vishwambhara’
త్వరలోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు మొదలుపెడతారు. ముందుగా ఓ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ఇందులో సాయిదుర్గ తేజ్ కూడా నటించాడు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.