
‘జాక్’ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన హీరోయిన్ గా నటించింది వైష్ణవి చైతన్య. ఈ సినిమాలో సిద్ధు పాత్ర ఎలా ఉండబోతోందనే విషయంపై చాలామందికి ఓ ఐడియా ఉంది. మరి హీరోయిన్ సంగతేంటి?
ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోలేదు. ఎందుకంటే, కమర్షియల్ సినిమాలో హీరోయిన్ రోల్ ఏముంటుంది… 3 పాటలు, 2 ముద్దులు టైపులోనే ఉంటుంది ఏ సినిమాలోనైనా. అయితే ‘జాక్’లో మాత్రం అంతకుమించి అంటోంది వైష్ణవి.
“ఈ సినిమాలో నాది డబుల్ రోల్. అలా 2 రోల్స్ చేయడానికి ఓ మెయిన్ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ చాలా ఎంటర్ టైనింగ్ గా, ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర.”
ఇలా సినిమాలో తనది కూడా కీలకమైన పాత్ర అనే విషయాన్ని వైష్ణవి చైతన్య బయటపెట్టింది. లాంగ్ గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ నుంచి వస్తున్న సినిమా ఇది. “బేబీ” సినిమాతో పాపులారిటీ తెచ్చుకుంది వైష్ణవి. ఈ సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ హైలెట్ కానుందట.