సుదీర్ఘ సస్పెన్స్ కు తెరదించుతూ 12వ తేదీన తన చిరకాల మిత్రుడు ఆంటోనీ తటిల్ ను పెళ్లాడింది కీర్తిసురేష్. ఈ వివాహ వేడుక కోసం ఒకటి కాదు, రెండు సంప్రదాయ చీరలు ధరించింది. డిజైనర్ అనితా డోంగ్రే ఈ చీరల్ని డిజైన్ చేశారు. ఆమె వేసుకున్న పసుపు-ఆకుపచ్చ కాంచీవరం చీర వెనుక ఒక కథ ఉంది.
కీర్తి సురేష్ కి చాలా కాలంగా సైలిస్ట్ గా ఉన్న శృతి మంజరీతో కలిసి అనితా డోంగ్రే ఈ చీరను డిజైన్ చేసిందట. రంగులు మాత్రమే కాదు, ఏ దారం ఉపయోగించాలనే అంశంపై కూడా ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించుకున్నారట. 9 గజాల ఈ చీరలో బంగారంతో జరీ వర్క్ చేశారు.
ALSO READ: కాపురం దుబాయిలోనేనా?
ఈ చీర నేతలో కోవై ప్రాంతంలో పేరొందిన నేత పనితనం చూపించారట. కొంగు, చీర బోర్డర్ వేర్వేరు రంగుల్లో ఉండడం కోవై చేనేత సంప్రదాయం. అలాగే ఈ చీరలో కీర్తి సురేష్ స్వయంగా రాసిన కవితని కూడా జోడించారట.
పైకి పసుపు-ఆకుపచ్చ కనిపించినప్పటికీ, విభిన్నమైన లుక్ రావడం కోసం చీరలో అంతర్భాగంగా మరో 3 రంగుల దారాలు వాడారంట. డిజైనర్ అనితా డోంగ్రే బృందం దీన్ని తయారు చేయడానికి అక్షరాలా 405 గంటల సమయం తీసుకుంది.
ALSO READ: Keerthy Suresh shares her Christian-way wedding pictures
పూర్తిగా హ్యాండ్ వర్క్ తో చేసిన చీర ఇది. అటు కీర్తి సురేష్ భర్త ఆంటోనీ తటిల్ కు కూడా అనితానే దుస్తులు రూపొందించారు. అతడు ధరించి పంచెను తయారుచేయడానికి అక్షరాలా 150 గంటల సమయం కేటాయించారట. ఇలా ఫ్యాషన్ ప్రపంచాన్ని కూడా ఆకర్షించింది కీర్తి సురేష్ పెళ్లి.
ఐతే ఈ చీర చాలా అందంగా ఉందని కొన్ని కామెంట్స్ వచ్చినప్పటికీ ఒక డిజైనర్ చేయించిన చీరలా లేదని, సాధారణ నేత కార్మికుడి సృష్టిలా ఉంది అని కామెంట్స్ పడుతున్నాయి ఆ డిజైనర్ ఇన్ స్టాగ్రామ్ పోస్టులో.