
తమన్న ఇటీవల తన ప్రియుడు విజయ్ వర్మతో బ్రేకప్ చెప్పింది. ఇద్దరి దార్లు వేరు అయ్యాక ఆమె భక్తి బాట పట్టింది అనే కామెంట్ వినిపిస్తోంది. 35 ఏళ్ల తమన్న ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోవాలని భావించింది. కానీ పెళ్లి విషయంలోనే విజయ్ వర్మకు, ఆమెకి విబేధాలు వచ్చినట్లు సమాచారం. దాంతో విడిపోయారు.
గత కొంతకాలంగా దేవాలయాల్లో తరుచుగా పూజలు చేస్తోన్న తమన్న రెండు రోజుల క్రితం తన ఇంట్లో అమ్మవారి పూజలు నిర్వహించింది. తల్లితండ్రులతో కలిసి పూజలు చేసింది. ఉత్తరాదిన “Mata Ki Chowki” అని అమ్మవారి పూజలు చేస్తారు ఇంట్లో. అలా తన ఇంట్లో తమన్న ఈ పూజ చేసి తన మితృరాళ్ళని ఆహ్వానించింది. నిర్మాత ప్రగ్య కపూర్, రవీనా టాండన్ కూతురు రష తదని (“ఊహి అమ్మ” పాటతో నటిగా పాపులర్ అయింది), తదితరులు పాల్గొన్నారు.
ఆ వీడియోని తమన్న షేర్ చేసింది. ఈ పూజలో భక్తితో భజన చెయ్యడం, దేవిని స్తుతిస్తూ పాటలు పాడడం చేస్తారు. ఈ వీడియోలో అది అంతా కనిపిస్తోంది.
మరోవైపు, ఆమె తాజాగా నటించిన తెలుగు మూవీ “ఓదెల 2″లో కూడా ఆమెది నాగ సాద్వి పాత్ర. భక్తి పాత్రే.