
నటి సుమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. బోర్డు తిప్పేసిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వల్ల తన పేరు బద్నామ్ అవుతుండడంతో ఆమె వెంటనే స్పందించింది. వివరణ ఇచ్చింది.
రాజమండ్రికి చెందిన రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పి జనం నుంచి డబ్బులు లాగింది. దాదాపు 88 కోట్ల మొత్తం రాబట్టుకోండి. తాజాగా ఆ సంస్థ బోర్డు తిప్పేసింది.ఈ రియల్ ఎస్టేట్ యాడ్ లో నటి, యాంకర్ సుమ నటించారు. సుమతో పాటు ఆమె భర్త నటుడు రాజీవ్ కనకాల కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం చేశారు.
సుమని నమ్మి మేం కొన్నామంటూ కొందరు బాధితులు వాపోయారు. దాంతో, ఆమె తాజాగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా వివరణ పోస్ట్ చేశారు.
“ఆ కంపెనీకి తాను 2016 నుంచి 2018 వరకే ప్రచారం చేశాను. ఆ తర్వాత ఆ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేద,” అని ఆమె వివరించారు.
ఇది సుమ పూర్తి వివరణ…