తనకున్న కొద్దిపాటి అనుభవంతోనే పవన్ కల్యాణ్ ను డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు సుజీత్. పైగా ఫ్లాప్ ఇచ్చిన తర్వాత ఇంత పెద్ద అవకాశం అంటే, అది అతడి అదృష్టం. ఇంతకీ సుజీత్ కు ఆ అవకాశం ఎలా వచ్చింది? బయట వినిపిస్తున్న పుకార్లలో నిజం ఎంత?
నిజానికి ఓ రీమేక్ కథ కోసం సుజీత్ ను తీసుకున్నారట. త్రివిక్రమ్ ఆదేశాలతో సుజీత్ కూడా ఆ రీమేక్ పై బాగానే వర్క్ చేశాడట. ఓవైపు రీమేక్ ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నాడు కానీ, అతడి మనసు మొత్తం స్ట్రయిట్ సినిమాపైనే ఉంది.
ఈ క్రమంలో ఓరోజు సుజీత్ తో మాట్లాడుతూ.. కొత్త కథ ఏమైనా ఉందా అని అడిగాడంట పవన్. వచ్చిన అవకాశాన్ని సుజీత్ అద్భుతంగా వినియోగించుకున్నాడు. అప్పటికే పవన్ కోసం అనుకున్న ఓ లైన్ ను వినిపించాడట.
స్టోరీలైన్ పవన్ కు బాగా నచ్చింది. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అలా “ఓజీ “సినిమా పట్టాలపైకి వచ్చింది. “భజే వాయువేగం” సినిమా ప్రమోషన్ లో భాగంగా కార్తికేయను ఇంటర్వ్యూ చేస్తే, ఈ విషయాల్ని బయటపెట్టాడు సుజీత్.