“పళ్ళు మెల్లగా తోముకోవచ్చు… కానీ ముందు ఎంజాయ్ చెయ్యాలి”
ఇది శ్రీనిధి శెట్టి భావన. ఈ అమ్మడు ప్రస్తుతం వెకేషన్ లో ఉంది. ఉదయం లేవగానే బీచ్ నిర్మానుష్యంగా కనిపించిందట. ఇక సూర్యోదయం సమయంలో ఎవరూ లేని బీచ్ లో జలకాలాట కోసం బెడ్ మీది నుంచి లేచి పరిగెత్తిందట.
“అప్పటికి పళ్ళు కూడా తోముకోలేదు. నా పళ్ళు నా కోసం ఆగుతాయి… కానీ ఉదయపు అలలు ఆగవు కదా,” అని చెప్తోంది. అన్నట్లు అలా ఉదయపు కాలకృత్యాలు తీర్చుకోకుండా బీచ్ లో దిగి, ఆ వేషంలోనే ఫోటోలు దిగి ఇలా మనకు షేర్ చేసింది.
“KGF” సినిమాలతో పాపులర్ అయిన ఈ బ్యూటీకి ఎందుకనో వెల్లువలా ఆఫర్లు వచ్చి పడలేదు. అంత పెద్ద హిట్ వచ్చినా ఇంకా అవకాశాల కోసం నిరీక్షిస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డ సరసన “తెలుసు కదా” అనే మూవీలో నటిస్తోంది.