బాలీవుడ్ సీనియర్ నటుల్లో అనుపమ్ ఖేర్ స్థానం ప్రత్యేకం. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అనుపమ్ ఖేర్ ఇటు కమర్షియల్ సినిమాల్లోనూ, అటు ఆర్ట్ సినిమాల్లోనూ తన ప్రతిభ చూపారు. ప్రస్తుతం అధికార బీజేపీకి బాగా కావాల్సిన వ్యక్తి.
ఆయన తాజాగా ఎన్టీఆర్ ని కలిశారు. ప్రస్తుతం “వార్ 2” సినిమా షూటింగ్ కోసం ముంబైలో మకాం వేసిన ఎన్టీఆర్ ని పలువురు బాలీవుడ్ తారలు కలుసుకుంటున్నారు.
అనుపమ్ ఖేర్, ఎన్టీఆర్ కూడా ముంబైలో తారసపడ్డారు.
దాంతో ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటోని అనుపమ్ ఖేర్ షేర్ చేశారు. ఎన్టీఆర్ నటన అంటే ఇస్తామని పేర్కొన్నారు. తనకి అంత్యంత ఇష్టమైన నటుల్లో తారక్ ఒకరు అని ప్రశంసించారు. అంతే కాదు ఈ ఫోటోకి “ఆర్ ఆర్ ఆర్” సినిమాలోని దోస్తీ పాట ట్రాక్ ని కూడా జోడించారు.
ఆయన పోస్ట్ ని తారక్ అభిమానులు బాగా వైరల్ చేస్తున్నారు.