విజయ్ దేవరకొండ, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల కలుసుకున్నారు. వారిద్దరూ కలుసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఆ మాటకొస్తే విజయ్ దేవరకొండకు దర్శకుడు ప్రశాంత్ నీల్, కన్నడ సూపర్ స్టార్ యష్ తో “కేజీఎఫ్” విడుదలకు ముందు నుంచే మంచి స్నేహం ఉంది.
ఐతే, తాజాగా విజయ్ దేవరకొండని ప్రశాంత్ నీల్ కలవడం, ఆ ఫోటో బయటికి రావడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం దేశంలో ప్రశాంత్ నీల్ మన టాప్ డైరెక్టర్ రాజమౌళి తర్వాత యమా క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు. “కేజీఎఫ్” సినిమాలతో పాటు “సలార్”తో ఆయనకి క్రేజ్ అమాంతం పెరిగింది.
పైగా ఇప్పుడు “సలార్ 2” మొదలు కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో మూవీ ఉంది. దాంతో, విజయ్ ని ఎందుకు కలిశాడు అనే ప్రశ్న వస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ ఇప్పుడు పూర్తిగా ఫ్లాపుల్లో ఉన్నాడు. వచ్చిన స్టార్డంకి దెబ్బ పడింది.
విజయ్ దేవరకొండ, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాబోవడం లేదు. కేవలం ఇది స్నేహపూర్వక మీటింగ్ అని సమాచారం.