ఇప్పుడు పెద్ద సినిమాలకు, పాన్ ఇండియా చిత్రాలకు తప్పనిసరి నటిగా మారింది కియారా అద్వానీ. ఆమెకున్న డిమాండ్, క్రేజ్ అలా ఉంది మరి. ఆమె చేతిలో ఉన్న చిత్రాలన్నీ అలాంటివే.
తాజాగా మరో పెద్ద పాన్ ఇండియా చిత్రానికి ఈ భామ డేట్స్ ఇచ్చేసింది. “కేజీఎఫ్” హీరో యష్ నటిస్తున్న కొత్త చిత్రం యష్ లో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది అనేది పాత న్యూస్. ఇప్పుడు ఆమె ఈ సినిమాకి తన కాల్షీట్లు కూడా ఇచ్చేసింది. ఇక ఆమె ఫోకస్ అంతా “టాక్సిక్”పైనే.
ఆమె తెలుగులో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఇక హిందీలో ఆమె ఒప్పుకున్న బడా చిత్రం “డాన్ 3” ఇంకా షూటింగ్ ఊపందుకోలేదు. మరోవైపు, “వార్ 2” సినిమా షూటింగ్ మొదలైంది కానీ ఆమె పాత్రకి సంబంధించిన చిత్రీకరణ మేలో మొదలవుతుంది.
సో, ఆమె ఇప్పుడు యష్ సినిమాకి సులువుగానే డేట్స్ ఇచ్చేసింది.
సినిమాకి మూడున్నర నుంచి ఐదు కోట్ల వరకు పారితోషికం తీసుకునే కియారా అద్వానీ పెళ్లి తర్వాత పెద్ద సినిమాలు రావడం విశేషం.