ఒక్క సినిమా హిట్ అయితే అదే పంథాలో సినిమాలు తీయడం మనవాళ్లకు అలవాటు. ‘బాహుబలి’ సినిమా హిట్ తర్వాత ఇప్పుడు తామరతంపరగా “పార్ట్ 2″లు ఎలా వస్తున్నాయో చూస్తున్నాం.
ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ తాజాగా “డీజే టిల్లు”కి రెండో భాగంగా “టిల్లు స్క్వేర్” అనే సినిమా రూపొందించింది. అది పెద్ద హిట్. దాంతో ఇప్పుడు తమ సంస్థ నుంచి వచ్చే ఇతర సినిమాలకు కూడా స్క్వేర్ అనే టైటిల్ పెట్టేస్తోంది.
ఈ సంస్థ తీసిన “మ్యాడ్” చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ తీస్తోంది. ఈ సీక్వెల్ కి కూడా “మ్యాడ్ స్క్వేర్” అనే పేరు పెట్టారు. అంటే ఇక పార్ట్ 2కి స్క్వేర్ అనే సెంటిమెంట్ తో వెళ్తుంది ఈ సంస్థ.
అలాగే “టిల్లు”కి మూడో భాగం కూడా తీస్తుందట. దానికి “టిల్లు క్యూబ్” అనే పేరుని పరిశీలిస్తున్నట్లు టాక్.