శృతి హాసన్ చేస్తున్నవే తక్కువ సినిమాలు. అందులో మళ్లీ ఓ సినిమా చేజారింది. “డెకాయిట్” ప్రాజెక్ట్ నుంచి శృతిహాసన్ బయటకొచ్చింది.
ఈ సినిమాకు సంబంధించి శృతిహాసన్ పై చాలా పోర్షన్ షూటింగ్ చేశారు. అడివి శేష్, శృతిహాసన్ మధ్య వచ్చే ఓ సీన్ కూడా విడుదల చేశారు. ఇలా అంతా సాఫీగా సాగిపోతోన్న టైంలో ఆమెకి, హీరోకి విభేదాలు వచ్చాయి. ఆమె సినిమా నుంచి తప్పుకొంది. ఆమె స్థానంలో ఇప్పుడు మరో హీరోయిన్ ని తీసుకుంటున్నారు.
ఇక ఈ సినిమా కాకుండా ఆమెకి మరో సినిమా కూడా ఆగింది. ఆమె ఎంతో ఆశలు పెట్టుకొన్న “సలార్ 2” సినిమా షూటింగ్ మరో రెండేళ్లకు వాయిదా పడింది. “సలార్ 2” సినిమా స్థానంలో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు “సలార్ 2” మొదలు కాదు.
అలా శృతి హాసన్ కి ఒక సినిమా పోయింది, ఒక ఆగింది.
ప్రస్తుతం ఈ భామ రజినీకాంత్ సినిమాలో నటిస్తోంది. లోకేష్ కనగరాజ్ తీస్తున్న సినిమాలో ఈ భామ కీలక పాత్ర పోషిస్తోంది.