![Double iSmart](https://telugu.telugucinema.com/wp-content/uploads/2024/06/doublismartshooting.jpg)
విశ్వంభర – చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియా ఫాంటసీ సినిమా విశ్వంభర. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టుడియోస్ లో జరుగుతోంది. తాజాగా ఈ ప్రాజెక్టులోకి ఎంటరైన బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్, చిరంజీవిపై ఓ యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్నారు.
పుష్ప-2.. రామోజీ ఫిలింసిటీలో పుష్ప-2 షూటింగ్ జరుగుతోంది. ఫిలింసిటీలో వేసిన విలేజ్ సెట్ లో కొన్ని సీన్స్ తీస్తున్నారు. ఆగస్ట్ 15న రావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
డబుల్ ఇస్మార్ట్ – రామ్-పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. మొన్నటివరకు ముంబయిలో జరిగిన ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. నిన్నటివరకు రామ్, గెటప్ శీనుపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో రామ్ పై సాంగ్ షూట్ నడుస్తోంది.
మిస్టర్ బచ్చన్ – రవితేజ-హరీశ్ శంకర్ క్రేజీ కాంబోలో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. అన్నపూర్ణ స్టుడియోస్ లో రవితేజ, భాగ్యశ్రీపై సాంగ్ షూట్ చేస్తున్నారు.
ఈ సినిమాలతో పాటు గోపీచంద్ విశ్వం, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాలు కూడా షూట్ మోడ్ లో ఉన్నాయి. విశ్వం సినిమా షూట్ హైదరాబాద్ లో నడుస్తుంటే.. లక్కీ భాస్కర్ షెడ్యూల్ ముంబయిలో కొనసాగుతోంది.