హీరోయిన్ అలియా భట్ మరోసారి డీప్ ఫేక్ బారిన పడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న ఓ ట్రెండ్ కు కొనసాగింపుగా, ఎవరో అగంతకుడు అలియా భట్ డీప్ ఫేక్ వీడియో చేశాడు. సంప్రదాయబద్ధంగా దుస్తులు వేసుకొని, టేబుల్ ముందుకొచ్చి ముస్తాబవుతున్న వీడియోకు అలియా ముఖం తగిలించి సోషల్ మీడియాలో పెట్టాడు.
ఇది అభ్యంతరకరమైన వీడియో కాదు కాబట్టి పెద్దగా కంప్లయింట్స్ లేవు. అయినప్పటికీ ఇలా డీప్ ఫేక్ చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి నెటిజన్లు ఈ వీడియోపై రిపోర్ట్స్ కొడుతున్నారు.
అలియా ఇలా డీప్ ఫేక్ బారిన పడడం ఇదే తొలిసారి కాదు. గతంలో వామికా గాబి వీడియోకు అలియా ముఖం పెట్టి ఓ ఎక్స్ పోజింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఓ శృంగారభరిత పోజుకు అలియా భట్ ముఖం మార్ఫింగ్ చేశారు.
దాదాపు స్టార్ హీరోయిన్లంతా ఇప్పటికే డీప్ ఫేక్ బారిన పడ్డారు. కొంతమంది స్టార్ హీరోలు, హీరోయిన్ల ముఖాల్ని ఏఐ సహాయంతో డీప్ ఫేక్ చేసి, తమ ఉత్పత్తుల ప్రచారానికి కూడా వాడుకుంటున్నారు.