
తను ఏం చేసినా కొత్తగా ఉంటుందని మరోసారి నిరూపించుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఓ ఈ-సైకిల్ బ్రాండ్ ప్రచారం కోసం ధోనీతో కలిసి యాడ్ షూట్ చేశాడు. ఇందులో ధోనీని ‘యానిమల్’ లో రణబీర్ కపూర్ లా చూపించి అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు.
ఏమాటకామాట చెప్పుకోవాలి. ధోనీ యాక్టింగ్ ఇరగదీశాడు. సినీ నటుడికి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో అతడి యాటిట్యూడ్ ఉంది. ఇక యాడ్ చివర్లో ‘యానిమల్’లో రణబీర్ కపూర్ చేసిన మేనరిజమ్ ను ధోనీతో చేయించి, తనదైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు వంగా.
ప్రస్తుతం ఈ దర్శకుడు ‘స్పిరిట్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఒక దఫా మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేశాడు. తాజాగా నటీనటుల ఎంపిక కూడా పూర్తిచేశాడు. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం.
లెక్కప్రకారం ఈ పాటికే సినిమా సెట్స్ పైకి రావాలి. కానీ ప్రభాస్ ఆమధ్య గాయపడడం, ఆ తర్వాత ఇతర సినిమాల షూటింగ్స్ తో బిజీ అవ్వడం వల్ల ‘స్పిరిట్’ షూట్ లేట్ అవుతోంది.