
“వార్ 2” టీజర్లో కియారా అద్వానీ బికినీ షాట్ చూసి కుర్రాళ్లు మతి పోగొట్టుకున్నారు. సాధారణ ప్రేక్షకులు, యువకులు ఆమె ఫిగర్ కి పడిపోతే అర్థం చేసుకోవచ్చు. కానీ రామ్ గోపాల్ వర్మ వంటి పేరొందిన దర్శకుడు చాలా చీపుగా కామెంట్ చేసి అడ్డంగా బుక్కయ్యారు. తప్పు తెలుసుకొని ట్వీట్ ని తొలగించారు.
కియారా బికినీ ఫోటోని షేర్ చేస్తూ ఆయన ఇలా చిల్లరగా కామెంట్ చేశారు: “దేశం కోసం యుద్ధం కాదు. కియారా బ్యాక్ ఎవరికి దక్కాలి అనే విషయంలో పోటీ ఎన్టీఆర్, హృతిక్ మధ్య పెడితే సినిమా బ్యాక్ బస్టర్ అవుతుంది.”
ALSO READ: Kiara Advani’s bikini sensation sparks AI speculation
కియరా బ్యాక్ మీద మనసు పాడేసుకున్నావా అంకుల్ అంటూ వర్మని కుర్రాళ్లు ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఐతే, పేరొందిన సెలెబ్రిటీలు వర్మ పోస్ట్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో వర్మ ఆ పోస్ట్ ని డిలీట్ చేశారు.
ALSO READ: అటెన్షన్ అంతా కియరాదే
మొత్తానికి కియరా తన బికినీ షోతో కుర్రాళ్ల నుంచి పేరొందిన ఫిలింమేకర్స్ అందరికీ నిద్ర లేకుండా చేసింది.