
నటుడు రఘుబాబు పాటలు కూడా పాడాడట. కాకపోతే ఎవరి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారో ఆయనకే తెలియదు. లేదా మర్చిపోయారు. దాంతో ఆయన కన్ఫ్యూజ్ అయి మిగతావాళ్ళని కన్ఫ్యూజ్ చేశారు.
“హరి హర వీర మల్లు” సినిమా మొదటి ప్రెస్ మీట్ ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమా ఈవెంట్ లో రఘుబాబు మాట్లాడారు. కీరవాణి గురించి పొగుడుతూ “కృష్ణం వందే జగద్గురుమ్” సినిమా కోసం ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడాను అని చెప్పారు రఘుబాబు. వెంటనే కీరవాణి ఆ సినిమాకి తాను సంగీతం అందించలేదని, మణిశర్మ పాటలు కంపోజ్ చేశారని అయన చెవిలో చెప్పారు.
అయినా రఘుబాబు అక్కడితో ఆపకుండా, “ఐతే వేదం సినిమాలో పాడి ఉంటాను” అని కీరవాణితో అన్నారు. దానికి, “అందులో కూడా పడలేదులే” అని సైగ చేశారు.
మొత్తానికి రఘుబాబు తాను కీరవాణికి ఏ పాట పాడానో, ఏ సినిమాలో గొంతు విప్పానో గుర్తుతెచుకోలేకపోయారు. కీరవాణి కూడా రఘుబాబు మాట్లాడుతున్నప్పుడు అయోమయంగానే కనిపించారు.