పైకి చెప్పరు.. కానీ ప్రేమలో ఉన్నారు. బహిరంగ ప్రకటన చేయరు.. కానీ బయట మాత్రం తరచుగా కలుసుకుంటారు. స్పెషల్ ఫ్రెండ్ అని మాత్రమే చెబుతారు.. స్పెషల్ అకేషన్స్ లో మాత్రం ఇట్టే కలిసిపోతారు. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక ముచ్చట ఇది.
వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఆ మేటర్ వాళ్లు చెప్పరు. విజయ్ దేవరకొండ ఇంటికి రష్మిక వెళ్లడం ఇదే తొలిసారి కాదు, ఇప్పటికే చాలాసార్లు ఆమె అతగాడి ఇంట్లో గడిపింది. ఇప్పుడు దీపావళి పండగను కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకుంది.
గమ్మత్తైన విషయం ఏంటంటే.. ప్రతిసారి ఆ విషయాన్ని వాళ్లు చెప్పరు. వాళ్లు రిలీజ్ చేసే ఫొటోలు చూసి నెటిజన్లు పసిగడతారు. ఈ దీపావళికి కూడా అదే జరిగింది. ఇద్దరూ ఒకే ఇంట్లో, ముఖ్యంగా విజయ దేవరకొండ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారని అర్థమౌతోంది.
ఐతే ఈ సారి రష్మిక కొంత ఓపెన్ అయింది. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫొటోల్లో కొంచెం క్లారిటీ ఇచ్చింది. ఫోటోలు తీసిన ఆనంద్ దేవరకొండకి థాంక్స్ చెప్పింది. సో ఇన్ డైరెక్ట్ గా దేవరకొండ ఇంట్లోనే ఉన్నాను అని చెప్పింది. అలా మెల్లగా ఆమె బయటపడుతోంది.
రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమ గురించి రహస్యం ఏమీ లేదు. వారు త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారు. కాకపోతే ప్రస్తుతం ఇద్దరూ కెరీర్ పై ఫోకస్ పెట్టారు. అదీ సంగతి.