కంగన రనౌత్ ఇప్పుడు బీజేపీ ఎంపీ. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. కానీ ఆమె నటించి, దర్శకత్వం వహించిన “ఎమెర్జెన్సీ” చిత్రానికి ఇంకా మోక్షం లభించడం లేదు. ఈ సినిమాలో ఆమె ఇందిరాగాంధీ పాత్ర పోషించారు.
సాధారణంగా ఇలాంటి సినిమాలను బీజేపీ ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తుంది. కానీ ఈ సినిమా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకో అంతగా ఆసక్తి చూపడం లేదు. లేని సమస్యలు వస్తాయని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, సులువుగా విడుదల కావాల్సిన ఈ సినిమాకి ఇన్ని అడ్డంకులు.
కెనెడా ప్రభుత్వంతో భారత్ దౌత్య సంబంధాలు క్షీణించాయి. ఇలాంటి టైంలో సిక్కులు – ఇందిరాగాంధీ అంశాలు ఈ సినిమాలో ఉండడంతో భారత్ వాదనకి ఇబ్బంది కలిగేలా ఉందట. అందుకే, ప్రభుత్వం నుంచి సహకారం అంతగా లేదు. ఐతే, కంగనా కూడా అభ్యంతరకర సన్నివేశాలను ఇప్పటికే తొలగించింది. ఐతే, విడుదల చెయ్యాలంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి ఆమోదం రావాలి.
అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే కంగనా ఈ సినిమా డేట్ ఫిక్స్ చేసి మళ్ళీ ప్రచార కార్యక్రమాలు మొదలుపెడుతుంది.