
రష్మిక మందాన టాప్ హీరోయిన్. ఆమెకి నెగెటివ్ పాత్రలు చెయ్యాల్సిన అవసరం లేదు. కానీ, ఈ భామ త్వరలోనే ఒక పెద్ద సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది అని టాక్.
అల్లు అర్జున్ హీరోగా అట్లీ తీస్తున్న భారీ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారు. అందులో మెయిన్ హీరోయిన్ దీపిక పదుకోన్. మృణాల్ ఠాకూర్, రష్మిక మందాన కూడా యాక్ట్ చేస్తున్నారు. ఐతే, ఇందులో మృణాల్ పాత్ర కన్నా రష్మిక పాత్రపైనే అందరి ఫోకస్. ఆమె నెగెటివ్ రోల్ లో దర్శనమిస్తుంది అన్న టాక్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకి దారి తీసింది. రష్మిక విలన్ తరహా పాత్ర చెయ్యాల్సిన అవసరం ఏంటి డిష్కసన్.
రష్మిక – అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇప్పటికే “పుష్ప”, “పుష్ప 2” సినిమాలు వచ్చాయి. వారి కాంబినేషన్ కి జనంలో యమా క్రేజ్ ఉంది.
ఐతే, ఆమె నిజంగా విలన్ గా నటించకపోవచ్చు. మొదట్లో విలన్ గా కనిపించినా కథ నడుస్తున్న కొద్దీ హీరో వైపు వచ్చే పాత్ర అయి ఉంటుంది.
రష్మిక త్వరలోనే విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో నటించనుంది. అలాగే, మరో రెండు భారీ హిందీ సినిమాలు కూడా త్వరలోనే స్టార్ట్ కానున్నాయి.















