
‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో రెడీ చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ స్టార్డం ని దృష్టిలో పెట్టుకొని హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో కూడా పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు.
పాన్ ఇండియా మార్కెట్ కోసమే యూపీలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఫైనల్ గా ఏపీలోనే జరగనుంది ఈవెంట్. జూలై 20వ తేదీన వైజాగ్ లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు రానున్నారు.
పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రచారానికి రాజకీయ నేతలను రప్పిస్తారని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతానికి అలాంటిదేమి కనిపించడం లేదు. ఐతే, వైజాగ్ ఈవెంట్ కి ఎవరు గెస్టులుగా వస్తారనేది చూడాలి.
“వీరమల్లు” సినిమాకి ఇప్పుడు బిజినెస్ క్రేజ్ పెరిగింది. ఇప్పటికే నైజాం, కర్ణాటక, సీడెడ్ ఏరియాలకు భారీ అమౌంట్స్ ఇస్తున్నారట.















