
జయాపజయాలు దైవాధీనాలంటూ అంటారు. అలా అని వాటిని లైట్ తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ విషయంలో ఇలా అనుకోవడానికి అస్సలు వీల్లేదు. వరుస హిట్లతో మంచి ఊపులో ఉన్న రష్మికకి సడెన్ గా బ్రేక్ పడింది.
బాలీవుడ్ లో రష్మిక అంటే ఓ బ్రాండ్. ఆమె అడుగుపెడితే సినిమా బ్లాక్ బస్టర్ అనే ఇమేజ్ ఉంది. ‘పుష్ప-2’, ‘యానిమల్’, తాజాగా ‘ఛావా’.. ఇలా ఏ సినిమా తీసుకున్నా పెద్ద హిట్. ఇలాంటి ముద్దుగుమ్మకు ఇప్పుడు బాలీవుడ్ లో తొలి బ్రేక్ పడింది. ఆమె నటించిన ‘సికిందర్’ అనే సినిమా నిన్ననే రంజాన్ కానుకగా రిలీజయింది. మొదటి రోజు ఇండియా మొత్తం కలిపితే 26 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇది సల్మాన్ ఖాన్ కెరీర్లోనే అతి తక్కువ ఓపెనింగ్ సాధించిన చిత్రాల్లో ఒకటి.
“సికిందర్” సినిమాకు మురుగదాస్ దర్శకుడు, సల్మాన్ ఖాన్ హీరో. పెద్ద బ్యానర్ బ్యాకప్ కూడా ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ కథలో మేటర్ లేదు, స్క్రీన్ ప్లేలో పస లేదు. దీంతో సినిమా బాగాలేదు. స్వయంగా సల్మాన్ అభిమానులు ఈ సినిమా చూసి చీదరించుకుంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
రిలీజైన కొన్ని గంటలకే సినిమా జాతకం తేలిపోయింది. రష్మిక కెరీర్ లో తొలి హిందీ ఫ్లాప్ వచ్చి చేరింది. నిజానికి రష్మిక నటించిన ‘గుడ్ బై’ అనే సినిమా హిట్ సినిమా కాదు. అప్పటికి ఆమెపై పెద్దగా అంచనాల్లేవు కాబట్టి దాన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. మూడు బ్లాక్ బస్టర్ల తర్వాత పెద్ద సినిమా నిరాశపరచడంతో ఆమె కొంత నిరాశ చెందింది.