
రష్మిక మందాన ఇప్పుడు ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరు. టాలీవుడ్, బాలీవుడ్… ఏ ఇండస్ట్రీలోనైనా ఆమెకున్న క్రేజ్ వేరు. నేషనల్ క్రష్ అనిపించుకున్న ఈ భామ ఈ రోజు (ఏప్రిల్ 5) తన 28వ పుట్టిన రోజుని సెలెబ్రేట్ చేసుకొంది.
ఈ బర్త్ డే వేడుకలను ఆమె అబుధాబిలో ఒక ఎడారి రిసార్ట్ లో జరుపుకోవడం విశేషం. ఈ రిసార్ట్ ప్రత్యేకత ఏంటంటే ఎడారి మధ్యలో ఒక చిన్నపాటి జూ ఉంది. ఈ జూలో జింకలు, నెమళ్ళు, ఇతర సాధు జంతువులు ఉంటాయి. వాటి మధ్య అన్ని సదుపాయాలు, వసతులతో కూడిన ఏసీ టెంట్లు. ఆమె తనకి బాగా కావాల్సిన స్నేహితులతో కలిసి ఇక్కడ పుట్టిన రోజుని సెలెబ్రేట్ చేసుకొంది.

రష్మిక మందాన ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తోంది. అవి: 1) పుష్ప 2 ది రూల్ 2) ది గర్ల్ ఫ్రెండ్ 3) కుబేర.
‘పుష్ప 2’లో ఆమె శ్రీవల్లిగా నటిస్తోంది. ఆమె పాత్రకి సంబంధించిన పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఇక ‘కుబేర’లో ఆమె ధనుష్ సరసన నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో ఇంకా ఆమె పాల్గొనలేదు. అందుకే ఆమె సాధారణ ఫోటోని రిలీజ్ చేశారు. ఇక ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనేది హీరోయిన్ ఓరియేంటేడ్ చిత్రం.
ఒకవైపు ఆమె అబుధాబిలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుంటే ఆమె నిర్మాతలు ఆమెకి సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు.