ఎన్నో ఏళ్ల కిందటే టాక్ షో చేశాడు రానా. ఇప్పుడు మరోసారి టాక్ షో చేస్తున్నాడు. అప్పుడు టీవీలో చేస్తే, ఇప్పుడు ఓటీటీ. అంతే తేడా. అయితే ఎప్పుడు ఎవరు టాక్ షో చేసినా అందులో కొంతమంది మిస్ అవుతుంటారు.
అప్పుడు రానా చేసిన టాక్ షోలో కొంతమంది మిస్సయ్యారు. ఇప్పుడు రాబోతున్న “ది రానా దగ్గుబాటి షో” కూడా కొంతమంది మిస్సయ్యారు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్, మహేష్. మరి.. వీళ్లు రాబోయే రోజుల్లో రానా షోలో కనిపించే ఛాన్స్ ఉందా?
దీనిపై క్లియర్ గా ఉన్నదున్నట్టు చెప్పేశాడు రానా. తన షోలో మహేష్ బాబు కనిపించే అవకాశం లేదని చెప్పేశాడు. రాజమౌళి తో సినిమా చేస్తున్న మహేశ్, ఇప్పట్లో మరే ఇతర షోలో కనిపించడని స్పష్టం చేశాడు.
అటు రామ్ చరణ్ పై మాత్రం పాజిటివ్ గా స్పందించాడు. ప్రతిసారి చరణ్ ను మిస్సవుతున్నానని, ఈసారి మాత్రం అతడ్ని తన షోకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని, కచ్చితంగా కాల్ చేసి మాట్లాడతానని హామీ ఇచ్చాడు.
రాజమౌళి, నాగచైతన్య, సిద్ధు జొన్నలగడ్డ, ఆర్జీవీ, నాని, తేజ సజ్జా, దుల్కర్ సల్మాన్, ప్రియాంక మోహన్, మీనాక్షి చౌదరి, శ్రీలీల.. ఇలా చాలామందిని ఇప్పటికే కవర్ చేశాడు రానా. అయితే వీళ్లంతా సోలోగా రారు. రాజమౌళి, నాగచైతన్య లాంటోళ్లు సోలోగా ఉన్నారు. ఎక్కువ ఎపిసోడ్స్ లో మినిమం ఇద్దరు కనిపిస్తారు.