రామోజీ రావు కన్నుమూశారు. ఆయనకు సంబంధించి వివరాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇందులో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ వెలుగులోకి వచ్చింది. లో-ప్రొఫైల్ మెయింటైన్ చేసే రామోజీ రావు, ఓ సినిమాలో నటించారు. ఈ విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
సినిమాలంటే రామోజీరావుకు ఇష్టం. అయితే సినిమాల్లో నటించాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఓ సినిమాలో ఆయన నటించాల్సి వచ్చింది. ఆ సినిమా పేరు మార్పు. 1978లో యు.విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాలో రామోజీ రావు జడ్జిగా అతిథి పాత్ర పోషించారు.
ఆయన పోషించింది అతిథి పాత్రే అయినప్పటికీ, అప్పట్లో పోస్టర్లపై ఆయన బొమ్మను ముద్రించారు. ఆయనకు ఉన్న క్రేజ్ అలాంటిది.
నిర్మాతగా రామోజీరావు కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాలు అందించారు. ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 2015లో వచ్చిన దాగుడుమూతల దండాకోర్ ఆయన నిర్మించిన చివరి చిత్రం.