
ఆ మధ్య వారం రోజుల పాటు హాట్ టాపిక్ గా మారింది అనన్య పాండే. దీనికి కారణం ఆమె తన బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పడమే. అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ విడిపోయారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. గ్రాండ్ గా పార్టీ ఇచ్చి మరీ వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని టాక్.
ఓవైపు ఇంత జరుగుతుంటే, అనన్య మాత్రం ఓపెన్ గా స్పందించలేదు. ఇన్నాళ్లకు ఆ టైమ్ రానే వచ్చింది. ఓ సినిమా ప్రచారంలో భాగంగా మీడియా ముందుకొచ్చిన అనన్య, తన బ్రేకప్ పై పరోక్షంగా స్పందించింది.
చాలా రోజులుగా ఓ అంశంపై మాట్లాడాలని అనుకున్నాను, కానీ మాట్లాడలేకపోయాంటూ ప్రారంభించిన అనన్య పాండే.. “మనకు మంచి విషయాలు అనిపించేవి కొన్ని విషపూరితంగా కూడా ఉంటాయి. కానీ వాటిని మనం వెంటనే గుర్తించలేం. జీవితంలో అన్ని ఎమోషన్స్ ను అనుభవించాలి. సంతోషంగా ఉన్నామనుకునేంతలోనే దుఃఖం కూడా ముంచుకొస్తుంది,” అంటూ స్పందించింది.
“లైగర్” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ భామకు ఇంకా సరైన హిట్ దక్కలేదు.