
రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఇటీవల లండన్ లో ఆవిష్కరించారు. మేడమ్ టుస్సాడ్స్ లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చరణ్, ఆయన భార్య, కూతురు వెళ్లారు. చరణ్ తల్లితండ్రులు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కూడా హాజరయ్యారు.
ఆవిష్కరణ అనంతరం రామ్ చరణ్ మైనపు విగ్రహంతో మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఫోటోలు తీసుకొంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రామ్ చరణ్ మైనం విగ్రహం ప్రత్యేకత ఏంటంటే… ఆయనతో పాటు ఆయన పెంపుడు కుక్కని కూడా అక్కడ ప్రతిష్టించారు. ఈ మ్యూజియంలో క్వీన్ ఎలిజిబెత్ తర్వాత పెంపుడు కుక్కతో మైనం విగ్రహం పొందిన ఏకైక సెలెబ్రిటీగా రామ్ చరణ్ రికార్డు సృష్టించారు.
రామ్ చరణ్ భార్య చాలా ఆనందంగా ఉన్నారు. ఆమె ఎక్కువ ఫోటోలు దిగడం విశేషం. “నిజమైన భర్త కన్న ఈ వాక్స్ భర్త బాగున్నాడు,” అంటూ ఉపాసన జోక్ చేసింది. ఆ ఫోటోలను, వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో ఉపాసన షేర్ చేసింది.