
వినేవాడుంటే హీరోయిన్లు చాలా కథలు చెబుతారు. హీరోయిన్ అమలాపాల్ కూడా ఇప్పుడు అదే పనిచేసింది. దర్శకుడు ఏఎల్ విజయ్ తో విడాకులు తీసుకున్న తర్వాత, జగత్ దేశాయ్ అనే హోటల్స్ యజమానికి ఈమె కనెక్ట్ అయిన సంగతి తెలిసిందే.
అతడ్ని ప్రేమించి పెళ్లాడింది. తల్లి కూడా అయింది. ఇప్పుడు ఓ కొత్త విషయాన్ని బయటపెట్టింది.
డేటింగ్ లో ఉన్నప్పుడు తను హీరోయిన్ అనే విషయం జగత్ కు తెలియదంట. ఓ హీరోయిన్ గా కాకుండా, కేరళకు చెందిన ఓ సాధారణ స్త్రీలానే అమలాపాల్ ను చూశాడంట.
పెళ్లి తర్వాత తను హీరోయిన్ అని చెబితే జగన్ ఆశ్చర్యపోయాడంట. తాజాగా ఈ విషయాలు చెబుతూ అందర్నీ నమ్మమంటోంది అమలాపాల్. అమలాపాల్-జగత్ రెండేళ్లు ప్రేమించుకున్నారు. ఈ రెండేళ్లలో జగత్ కనిబెట్టలేకపోయాడంట.
ALSO READ: Amala Paul sends ‘peace’ message

విషయం తెలిసిన తర్వాత యూట్యూబ్ లో తన వీడియోల్ని భర్త ఎక్కువగా చూస్తున్నాడని అంటోంది. సినిమా క్లిప్స్ కంటే తను పాల్గొన్న ప్రెస్ మీట్స్, రెడ్ కార్పెట్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నాడట.