తెలుగులో ఇప్పటివరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లు అంటే హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, ఖమ్మం, రాజమండ్రి, కాకినాడ… ఇలా లోకల్ గా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు “గేమ్ ఛేంజర్” ఎంటర్ అయి గేమ్ మార్చేస్తున్నారు. ఇప్పటికే డల్లాస్ లో అడుగుపెట్టిన రామ్ చరణ్ అక్కడి అభిమానులను కలిసి కొత్త స్టయిల్ లో ప్రమోషన్ మొదలు పెట్టారు.
శనివారం సాయంత్రం “గేమ్ ఛేంజర్” ఈవెంట్ డల్లాస్ లో జరుగుతుంది. ఈవెంట్ కు ముందు అభిమానులతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, దిల్ రాజు పాల్గొన్నారు.రామ్ చరణ్ ఇంటరాక్షన్ అక్కడి అభిమానులను ఉత్తేజ పరిచింది.
అమెరికా గడ్డపై సినిమా వేడుక జరుపుతున్న మొట్టమొదటి భారతీయ హీరోగా రామ్ చరణ్ చరిత్ర సృష్టిస్తున్నారు. .
శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 10న రిలీజ్ కానుంది. కియారా అద్వానీ హీరోయిన్. తమన్ స్వరపరిచిన పాటలు క్లిక్ అయ్యాయి.