వెన్నెల కిషోర్ నటించిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’లో అనన్య నాగళ్ళ హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 25న థియేటర్లలో రానున్న ఈ చిత్రం గురించి ఆమె చెప్తున్న ముచ్చట్లు…
‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ మీ పాత్ర ఏంటి?
ఇలాంటి కథ నేను ఇంతకుముందు వినలేదు. దర్శకుడు మోహన్ గారు కథ చెప్పినపుడు చాలా కొత్తగా అనిపించింది. ఒక సంఘటన జరిగినపుడు అందులో ఒకొక్కరి కోణం నుంచి ఒకొక్క పెర్స్ఫెక్టివ్ ఉంటుంది. ఇలా కథని తీసుకెళ్లడం నాకు చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఇందులో డిటెక్టివ్ అమ్మ పేరు షర్మిలమ్మ, నాన్న పేరు లోకనాథ్, తన పేరు ఓం ప్రకాష్. ఈ మూడు పేర్లలో ఫస్ట్ లెటర్ సౌండింగ్ తో షెర్లాక్ హోమ్స్ అని పెట్టడం జరిగింది. ఇక నా పాత్ర పేరు భ్రమరాంబ. ఇప్పటివరకు నేను ఇలాంటి పాత్ర చెయ్యలేదు.
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారా?
తెలుగుతో పాటు హిందీలో ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇప్పటికే చేస్తున్నాను.
మీ కెరీర్ సంతృప్తినిస్తోందా?
చాలా హ్యాపీగా వున్నాను. నాకు కంటిన్యూ గా వర్క్ వస్తోంది. ఈ ఏడాది “పోట్టేల్” సినిమాకి మంచి ప్రశంసలు వచ్చాయి. కొత్తగా రెండు సినిమాలు సైన్ చేశాను.
తదుపరి చిత్రాలు ఏంటి?
“కథాకళి”, “లేచింది మహిళా లోకం” 2025లో విడుదల అవుతాయి.