రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ప్రకటించి పోలీసులను హైరానా చేశారు. నేను ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నానంటూ డయల్ 112 కు లావణ్య ఫోన్ చేయగా వెంటనే ఆమె నివాసానికి చేరుకున్నారు నార్సింగి పోలీసులు. ఆమెని రక్షించి, కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు ఆమెకి భరోసా కల్పించారు.
“రాజ్ తరుణ్ మాల్వీ మలోత్రా మోజులో పడి మారి పోయాడు. నా మరణాన్ని కోరుకుంటున్నాడు. నేను చావాలని అనుకోవడానికి కారణం మాల్వీ మలోత్రా,” అంటూ ఆమె తన లాయర్ ఫోన్ కి మెసేజ్ పెట్టినట్లు సమాచారం.
తనపై పుకార్లు పుట్టిస్తున్నారు అని ఆమె అంటోంది. గాసిప్స్ తో విసిగిపోయాను అని చెప్తోంది. ఇప్పటికీ ఆమె రాజ్ తరుణ్ ని ఆమె భర్తగానే అభివర్ణిస్తోంది.
“నా భర్త నాకు కావాలని మాల్వి మలోత్రాను బ్రతిమిలాడాను కానీ తను వినిపించుకోవట్లేదు. ఇద్దరూ కులుకుతున్నారు. రాజ్ తరుణ్ ఆమె మోజులో, మాయలో ఉన్నాడు,” అని తాజాగా చెప్పింది.
ఇవన్నీ చూసి విసుగెత్తి, ఇక ఈ లోకంలో ప్రయాణం ముగిస్తున్నా అంటూ నిన్న అర్ధరాత్రి ఆమె హంగామా చేసింది.
ఐతే రాజ్ తరుణ్ తో సంబంధం గురించి ఆమె చెప్తున్న కొన్ని మాటల్లో రకరకాల తేడాలున్నాయి. ఆమె ఆమెని ఇబ్బందుల్లోకి నెట్టాయి.
ఒకసారి గుళ్లో పెళ్లి చేసుకున్నాను అని చెప్తోంది. మళ్ళీ అతను పెళ్లి చేసుకుంటాను అని మోసం చేశాడని అంటోంది. రాజ్ తరుణ్ వల్ల గర్భవతిని అయ్యాను… అబార్షన్ చేయించాడని మొదట చెప్పిన ఆమె ఆ తర్వాత తనకు మిస్ క్యారేజ్ అయింది అని చెప్పింది. ఇలా పరస్పర విరుద్ధ మాటలతో ఆమె తన కేసును తన బలపర్చుకొంది అని అంటున్నారు.