ఊహించని విధంగా హీరో రాజ్ తరుణ్, వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లావణ్య అనే అమ్మాయి అతడిపై కేసు పెట్టింది. తనను శారీరకంగా, మానసికంగా వాడుకొని వదిలేశాడని, రాజ్ తరుణ్ పై ఆమె ఆరోపణలు చేసింది.
5 పేజీల సుదీర్ఘ లేఖను పోలీసులకు సమర్పించిన లావణ్, రాజ్ తరుణ్ తో తను సహజీవనం చేశానంటూ సాక్ష్యాలుగా కొన్ని ఫొటోల్ని కూడా పోలీసులకు అందించింది. తాజాగా దీనిపై రాజ్ తరుణ్ స్పందించాడు. లావణ్యతో తను కలిసున్న విషయం నిజమేనని అంగీకరించిన రాజ్ తరుణ్.. 2017 తర్వాత ఆమెతో ఎలాంటి శారీరక సంబంధం పెట్టుకోలేదంటున్నాడు.
తను హైదరాబాద్ వచ్చిన కొత్తలో లావణ్య చాలా సహాయం చేసిందని, ఆ కృతజ్ఞతతో ఆమెను ఇన్నాళ్లూ భరించానని తెలిపిన రాజ్ తరుణ్, కేవలం తన పరువు పోతుందనే ఉద్దేశంతోనే మూసుకొని ఉన్నానని, ఇకపై ఉపేక్షించనని స్పష్టం చేశాడు.
అప్పుడు హెబ్బా.. ఇప్పుడు లావణ్య.. మధ్యలో అవికా
ఒక దశలో లావణ్యను పెళ్లి చేసుకోవాలని కూడా తను అనుకున్నానని, కానీ ఆ విషయం ఆమెకు చెప్పలేదని తెలిపిన రాజ్ తరుణ్.. ఎప్పుడైతే లావణ్య డ్రగ్స్ కు అలవాటు పడిందో, అప్పుడే ఆమెకు దూరమయ్యానని అంటున్నాడు.
అమ్మాయిలు, ఎఫైర్లు వంటి వివాదాలు రాజ్ తరుణ్ కు కొత్త కాదు. గతంలో హెబ్బా పటేల్ తో కూడా ప్రేయాణం సాగించినట్టు అతడిపై పుకార్లు వచ్చాయి. వాటిపై గతంలోనే రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చాడు. మరో వివాదంలో అవికా గౌర్, రాజ్ తరుణ్ పేర్లు వినిపించాయి. అయితే దానిపై ఎవ్వరూ ప్రకటన చేయలేదు. ఇప్పుడీ కొత్త వివాదాన్ని అతడు ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.