“పుష్ప” దేశవ్యాప్తంగా పెద్ద హిట్టయింది. “పుష్ప-2” సినిమా సెట్స్ పై ఉంది. ప్రస్తుతం షూటింగ్ నడుస్తోంది. డిసెంబర్ రిలీజ్. మరి పుష్ప-3 ఉందా? అసలు పుష్ప సినిమాకు పార్ట్-3 వస్తుందా? ఇలాంటి డౌట్స్ ఏం అక్కర్లేదు.
‘పుష్ప-3’ కూడా ఉందనే విషయాన్ని నటుడు రావు రమేష్ స్పష్టం చేశారు. పుష్ప కోసం ఇచ్చిన డేట్స్ ను చాలామటుకు రద్దు చేసిందట యూనిట్. అదేంటని అడిగితే పుష్ప-2 కోసం వాడుకుంటామని అన్నారట. అలా ఇప్పటివరకు 140 డేట్స్ రద్దయ్యాయని చెప్పుకొచ్చారు రావు రమేష్.
ఈ కారణం వల్లనే “పుష్ప” సినిమాలో తన నిడివి తగ్గిపోయిందన్నారు. తీరా ‘పుష్ప-2’ విషయానికొచ్చేసరికి, ఈసారి పుష్ప-3 కోసం మిగిలిన కాల్షీట్లు వాడుతామని చెబుతున్నారట. అలా ‘పుష్ప-3’ కూడా ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు రావు రమేష్.
మొదటి భాగంతో పోలిస్తే పార్ట్-2లో తన స్క్రీన్ స్పేస్ ఇంకాస్త ఎక్కువ ఉంటుందని తెలిపిన రావు రమేష్.. సినిమాలో తన పాత్ర కంటే సునీల్ పోషించిన పాత్ర అంటే తనకు చాలా ఇష్టమన్నాంటున్నారు.