“కల్కి 2898 AD” సినిమా వచ్చే నెలకు వాయిదా పడింది. ఈ సినిమా విడుదలకు ఇంకా 45 రోజులే మిగిలి ఉంది. కానీ టీం ఇప్పటికీ ప్రమోషన్లు మొదలు పెట్టలేదు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పబ్లిసిటీ ఈ నెలాఖరు నుంచి షురూ అవుతుంది. ఇక సినిమా ట్రైలర్ మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాతే విడుదల అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని నిర్మాత అశ్వనీ దత్ భావిస్తున్నారు. కొత్త గవర్నమెంట్ లో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు సులువుగా దొరుకుతుంది. ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రీ రిలీజ్ ఈవెంట్, భారీ ఇంటర్వ్యూలు, టీజర్ విడుదల వంటివి వరుసగా మొదలవుతాయి.
“కల్కి 2898 AD” సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకుడు. అతను నిర్మాత అశ్వనీ దత్ కి అల్లుడే. ఈ సినిమాలో ప్రభాస్ హీరో కాగా, దీపిక పదుకోన్, దిశా పటాని హీరోయిన్లుగా నటించారు. కమల్ హాసన్ విలన్ గా కనిపిస్తారు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో దర్శనమిస్తారు.
ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లోనే కాదు గ్లోబల్ లెవల్లో విడుదల చెయ్యనున్నారు. గ్లోబల్ ప్రమోషన్స్ మాత్రం త్వరలోనే స్టార్ట్ అవుతాయి.