
నయనతార జోరు తగ్గింది. హీరోయిన్ గా ఆమెకి అవకాశాలు తగ్గాయి. దాంతో ఆమె ఇప్పుడు సీనియర్ హీరోలకు జోడిగా, పెద్ద హీరోల చిత్రాల్లో స్పెషల్ పాత్రలపై ఫోకస్ పెట్టింది.
ALSO READ: Nayanthara to star opposite Mammootty
రెండేళ్ల క్రితం వరకు తమిళ్ లో నయనతార లేడి సూపర్ స్టార్ అనే ఇమేజ్ ని ఎంజాయ్ చేసింది. కానీ ఇప్పుడు ఆమెకి హీరోయిన్ ఓరియెంటడ్ చిత్రాలు కూడా రావడం లేదు. దాంతో, ఆమె సీనియర్ హీరోలతో సినిమాల వైపు చూస్తోంది. ఇప్పటికే తెలుగులో ఆమె చిరంజీవి సరసన హీరోయిన్ గా, అలాగే ఆయనకి సోదరిగానూ నటించింది.
ఇప్పుడు మలయాళంలో నయనతార సరసన మరోసారి నటించనుంది. ఇక కన్నడంలో యష్ హీరోగా రూపొందుతోన్న “టాక్సిక్” చిత్రంలో ఆమె అతనికి సోదరిగా నటిస్తోంది. ఇలా ఆమె తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటోంది.
ఈ ఏడాది ఆమె 40వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకోనుంది. సో, ఇప్పుడు కెరీర్ కొత్త టర్న్ తీసుకోవాలి. అందుకే, ఆమె ఇలా సీనియర్ హీరోలకు హీరోయిన్ గా, యువ హీరోల చిత్రాల్లో స్పెషల్ పాత్రలు చేస్తోంది.