
గ్లోబల్ స్థాయిలో పేరున్న ప్రియాంక చోప్రా గురువారం హైదరాబాద్ కి వచ్చింది అనే విషయం ఇప్పటికే మేం పోస్ట్ చేశాం. ఆమె హైదరాబాద్ కి రావడానికి కారణం కూడా దర్శకుడు SS రాజమౌళిని కలవడానికే అని చెప్పాం. అది నిజమని ప్రియాంక చోప్రా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియచేసింది.
రాజమౌళి తదుపరి చిత్రంలో ఆమె నటించనుంది అని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఈ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో ఆమె మహేష్ బాబు సరసన నటించనుంది. అందుకోసమే ఆమె హైదరాబాద్ రావాల్సి వచ్చింది.
శుక్రవారం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది.టొరంటో నుండి దుబాయ్ మీదుగా హైదరాబాద్‌కు విమానంలో వస్తున్న వీడియో అది. ఆమె విమానంలోని తన సీట్లో కాళ్లు సీట్ పై పెట్టుకొని రాజమౌళి తీసిన “ఆర్ ఆర్ ఆర్”లోని పాటని వింటున్నట్లుగా ఉంది ఆ వీడియోలో. ఆమె అలా తన హైదరాబాద్ ట్రిప్ గురించి ఇండైరెక్ట్ గా కంఫర్మ్ చేసింది. సో, ఆమె రాజమౌళి చిత్రంలో నటించింది అనేది పక్కాగా రూఢి అయింది.
త్వరలోనే టీం నుంచి ఇక అధికారిక ప్రకటన రావొచ్చు. ఆమె గతంలో “అపురూపం” అనే తెలుగు సినిమాలో నటించింది కానీ ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఆగిపోయింది.